తమిళ స్టార్ హీరో తలపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వారసుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా వెంకటేష్ బ్లాక్ బస్టర్ చిత్రం సంక్రాంతి తరహాలో ఉండనుంది అని లేటెస్ట్ టాక్. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ద్వారా వెల్లడించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ మొత్తం అక్టోబర్ నెలాఖరుకు పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లనుందని తాజా సమాచారం.
ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలుపోషిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa