విభిన్న స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ, తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన నటించిన కొత్త చిత్రం "అల్లూరి". ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా మేకర్స్ అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు. సెప్టెంబర్ 18వ తేదీన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. పోతే, ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని ఫిలింనగర్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.
ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa