ముడ్నెల్ల విరామం తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్ళీ కెమెరా ముందుకు ఈ రోజే వచ్చారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూడవ చిత్రమిది. అంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు అతడు, ఖలేజా సినిమాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
ప్రేక్షకాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ మూవీ షూటింగ్ ఈ రోజే మొదలైంది. ఈ సందర్భంగా మేకర్స్ సెట్స్ నుండి వర్కింగ్ స్టిల్ ను విడుదల చేసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను థ్రిల్ చేసారు. ఈ పిక్ లో సెట్ పనులు జరుగుతుండగా, డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి ముచ్చటిస్తున్న మహేష్ మనకు కనిపిస్తారు.
ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa