ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మగబిడ్డకు జన్మనిచ్చిన సూపర్స్టార్ కూతురు

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 02:56 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య నిన్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నిన్న రాత్రి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సౌందర్య. ఈ సందర్భంగా బాబు పేరును కూడా సౌందర్య రివీల్ చేసింది. బాబు పేరు వీర్ వనంగముడి.
2019లో నటుడు, వ్యాపారవేత్త విషగన్ వనంగముడి తో సౌందర్య వివాహం జరిగింది. వీరిద్దరికి పుట్టిన బాబే వీర్. ఐతే, వీరిద్దరికి కూడా ఇది రెండవ పెళ్లి. 2010లో ఇండస్ట్రియలిస్ట్ అశ్విన్ రామ్ కుమార్ తో సౌందర్యకు తొలి వివాహం జరగ్గా, అభిప్రాయ భేదాల వల్ల 2017లో ఈ జంట విడిపోయింది. వీరికి ఒక బాబు వేద్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa