కోలీవుడ్ స్టార్ హీరో శింబు, విభిన్న చిత్రాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో నటించిన సినిమా "వెందు తనిందతు కాదు". తెలుగులో "ది లైఫ్ ఆఫ్ ముత్తు" గా విడుదల కాబోతుంది.
కొంచెంసేపటి క్రితమే ఈ సినిమా తెలుగు టీజర్ విడుదలయింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ టీజర్ ప్రేక్షకుల మన్ననలను అందుకుంటుంది.
ఈ సినిమాకు AR రెహ్మాన్ సంగీతం అందించారు. వేల్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఇషారి గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ గారు సమర్పిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa