ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్?

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 08, 2022, 09:04 PM

మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా మలయాళంలో "లూసిఫర్‌" సినిమాకు రీమేక్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, గాడ్ ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు అవుతున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ ఇంకా అధికారకంగా ప్రకటించినప్పటికీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.


పొలిటికల్ డ్రామా ట్రాక్ లో  రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, పూరి జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5, 2022న తెలుగు మరియు హిందీలో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న గాడ్ ఫాదర్ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa