ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు విడుదల కానున్న 'అహింసా' వీడియో గ్లింప్సె

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 08, 2022, 08:59 PM

మూవీ మొగల్ డి రామానాయుడు మనవడు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకు అభిరామ్ దగ్గుబాటి టాలీవుడ్ లోకి హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ తేజ ఈ యంగ్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాకి "అహింస" అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాని సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, సెప్టెంబర్ 9, 2022న ఉదయం 09:09 గంటలకు ఈ సినిమాకి సంబందించిన వీడియో గ్లింప్సెని విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు ఒక స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.


ఈ సినిమాలో అభిరామ్ సరసన గీతిక అభిరామ్ జోడిగా నటించింది. ఈ చిత్రంలో సదా, కమల్ కామరాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పి పట్నాయక్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa