హీరోయిన్ శ్రియా శరణ్ ఎట్టకేలకు తన గారాల కూతురి ముఖం రివీల్ చేశారు. తెలుగు తెరకు 'ఇష్టం' సినిమాతో ఆమె పరిచయం అయ్యారు. తక్కువ సమయంలోనే టాప్ హీరోలందరితో ఆమె నటించారు. ప్రస్తుతం ఆమె తన కూతురుతో కలిసి వెకేషన్ లో ఉన్నారు. తన కూతురు రాధ, భర్త ఆండ్రీ కొస్చీవ్తో కలిసి శ్రియా టుస్కానీ పర్యటనలో ఉండగా ఆ ఫోటోలను ఆమె షేర్ చేశారు. ప్రతిసారీ తన కూతురి ముఖాన్ని చూపించని శ్రియా ఈసారి తన పాప ముఖాన్ని చూపించారు.