మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమా నుంచి గురువారం నయనతార లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సత్యప్రియ జైదేవ్ అనే పాత్రలో నయనతార నటించనుంది. మోహన రాజా డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. అక్టోబర్ 5న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తారని ప్రచారం జరుగుతోంది.
