ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ప్రారంభమైన సాయి ధన్షిక 'దక్షిణ' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 09:04 PM

'మంత్ర', 'మంగళ' వంటి విజయవంతమైన సినిమాలకి దర్శకత్వం వహించిన ఓషో తులసి రామ్ ఇప్పుడు కబాలి ఫేమ్ సాయి ధన్సికతో కలిసి మరో లేడీ ఓరియెంటెడ్ మూవీని అధికారకంగా ప్రకటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి 'దక్షిణ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు దక్షిణ మూవీ ఈరోజు లాంఛనంగా హైదరాబాద్ నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది. అంతేకాకుండా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత వంశీకృష్ణ తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రణతి, శ్వేతాభావన సౌండ్‌బోర్డ్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా అశోక్ షిండే మాట్లాడుతూ.. మూడు షెడ్యూల్స్‌లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి సెప్టెంబర్ 24 వరకు ఈ తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుండగా, రెండో షెడ్యూల్ అక్టోబర్ 6 నుంచి 20 వరకు గోవాలో జరగనుంది. మూడో షెడ్యూల్ నవంబర్ 1 నుంచి 10 వరకు హైదరాబాద్‌లో జరగనుంది అని ప్రకటించారు. ఈ సినిమాకి బాలాజీ సంగీతం అందిస్తున్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అశోక్ షిండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa