ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య తదుపరి సినిమాలో అరవింద్ స్వామి?

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 08:58 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో రూపొందనుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అనిల్ రావిపూడి ఈ సినిమాలో విలన్ రోల్ కోసం సీనియర్ హీరో అరవింద స్వామిని పరిశీలిస్తున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త పై మూవీ మేకర్స్ ఇంకా అధికారక ప్రకటన ఇవ్వనప్పటికీ ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దసరా పండుగ తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK107' సినిమాతో బిజీగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa