విక్రమ్ 'కోబ్రా' సినిమా రివ్యూ
విక్రమ్ కోబ్రా అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. మాథ్స్ టీచర్‌గా పనిచేసే మది (విక్రమ్)కి హత్యలు చేయాల్సిన అవసరం ఏంటి? అతను అనుకున్నది చేశాడా? లేదా? అనేదే ఈ సినిమా.
ఈ సినిమాల్లో చియాన్ విక్రమ్ ద్విపాత్రాభినయం చేయడమే కాక పలు ఇతర పాత్రల్లో కూడా కనిపించారు. మొత్తం సినిమాలో తొమ్మిది రకాల గెటప్స్ లో ఆయన కనిపిస్తూ ఉండడంతో పాటు సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ స్టాఫ్ అంతా కూడా సినిమాపై ఆసక్తి పెంచేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని విక్రమ్ అభిమానులైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఆగస్టు 11వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 31వ తేదీన విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
రివ్యూ విషయానికి వస్తే..
కోబ్రా అనేది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అయితే అందరు ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని చెప్పలేం. పండగ రోజు ఫ్యాసినిమా చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. విక్రమ్ నటన మెప్పిస్తుంది. థ్రిల్లింగ్, లాజికల్ సీన్స్ ఆకట్టుకోవు. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం కూడా మైనస్ గా చెప్పొచ్చు. కొన్ని యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బాగున్నాయి. మ్యూజిక్, కెమెరా పనితనం ఆకట్టుకుంది. రేటింగ్: 2.5/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa