స్వామి రా రా, దోచేయ్, రణరంగం,కేశవా, సూపర్ ఓవర్ సినిమాల దర్శకుడు సుధీర్ వర్మ ప్రస్తుతం మాస్ రాజా రవితేజ తో "రావణాసుర" సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తుండగా, సుశాంత్ అక్కినేని ఒక కీలకమైన పాత్రలో నటించనున్నారట.
షూటింగ్ ఫైనల్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుపుకుంటుంది. సుమారు ఐదు కోట్ల విలువైన సెట్ ను ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ రెడీ చేయించారట. ఇంత ఖర్చు పెట్టి క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారంటే, సినిమాలో ఈ పార్ట్ ఏ రేంజులో ఉండబోతుందో అని రవితేజ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కుతూహలంగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజితా పొన్నాడ, దక్షా నాగర్కర్ మిగిలిన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa