ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ - త్రివిక్రమ్ మూవీపై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 06:33 PM

అతడు, ఖలేజా సినిమాల తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ను మహేష్ త్రివిక్రమ్ లాక్ చేసేసారట. ఈ మేరకు సెప్టెంబర్ 8వ తేదీ నుండి హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో ఫస్ట్ షెడ్యూల్ జరగబోతుందట. ఈ షెడ్యూల్ దాదాపు ఒక నెలపాటు నిర్విరామంగా జరగబోతుందట. ఈ షెడ్యూల్ లో మహేష్ అండ్ టీం పై ఒక హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారట. 
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28, 2023లో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa