టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.
ఈ ఖాళీ టైం లో మహేష్ పూర్తిగా కుటుంబానికే పరిమితమై వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూతురు సితారతో కలిసి మహేష్ జీ తెలుగు ఛానల్ లో ప్రసరమౌతున్న డాన్స్ ఇండియా డాన్స్ అనే రియాలిటీ షోకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ షో స్టేజ్ మీద సితార డాన్స్ చెయ్యడం, అది చూసి మహేష్ మురిసిపోవడం... చూడటానికి రెండు కళ్ళు చాలవంతే. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కావడంతో ఆడియన్స్ ఈ షోకోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు.
మహేష్ బాబు జీ తెలుగు ఛానెల్ తో కుదుర్చుకున్న డీల్ కారణంగానే ఈ షోకు వచ్చారని తెలుస్తుంది. ఈ ఈవెంట్ పూర్తి ఎపిసోడ్ సెప్టెంబర్ 4వ తేదీన రాత్రి తొమ్మిదింటికి టెలికాస్ట్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa