"సీతారామం" సినిమాను ఇప్పటివరకు చాలామంది సినీ సెలెబ్రిటీలు పొగుడుతూ ట్వీట్లు చేసారు. లేటెస్ట్ గా ఈ లిస్టులోకి మెగాస్టార్ చిరంజీవి జాయిన్ అయ్యారు.
సీతారామం సినిమాను చూసిన మెగాస్టార్ మూవీ టీం కు ప్రత్యేక శుభాకాంక్షలను తెలుపుతూ స్పెషల్ నోట్ ను విడుదల చేసారు. విభిన్నమైన స్క్రీన్ ప్లేతో అద్భుతమైన ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం తనను కట్టిపడేసిందని తెలిపారు. అద్భుతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమాను ఒక ఎపిక్ లవ్ స్టోరీగా మలిచిన నిర్మాతలు అశ్వినీదత్, స్వప్న, ప్రియాంకలకు, డైరెక్టర్ హను రాఘవపూడికి, ముఖ్యంగా సీతారాంలుగా ప్రేమకథకు ప్రాణం పోసిన మృణాల్, దుల్కర్ లకు చిరంజీవి శుభాకాంక్షలను తెలియచేసారు.
ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవాలని కాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa