నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందు మొండేటి డైరెక్షన్లో ఇండియాస్ మిస్టికల్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా "కార్తికేయ 2". ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక అతిథి పాత్రను పోషించారు. సినిమాలో ఆ పాత్ర నిడివి చాలా తక్కువే అయినా, ఆ పాత్ర ప్రభావం సినిమా మొత్తానికి వెన్నెముకలా నిలిచిందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో అనుపమ్ మాట్లాడుతూ, సౌత్, నార్త్ సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. సౌత్ సినిమాలు కథ పరంగా వెళ్తూ, సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. బాలీవుడ్ సినిమాలు స్టార్ క్యాస్ట్ కే ప్రాధాన్యమిస్తూ, కథను సైడ్ చేస్తున్నారు. అందుకే సౌత్ సినిమాలు నార్త్ లో ప్రభంజనం సృష్టిస్తున్నాయి. హిందీ సినిమాలేమో సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నాయి.... అంటూ మాట్లాడారు.
ఒక సీనియర్ హిందీ నటుడి నుండి ఇలాంటి కామెంట్స్ రావడం ఒకరకంగా బాలీవుడ్ కి షాకింగ్ కలిగించే విషయమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa