ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT స్ట్రీమింగ్ భాగస్వామిని లాక్ చేసిన 'గాడ్ ఫాదర్' ?

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 05:23 PM

మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా మలయాళంలో "లూసిఫర్‌" సినిమాకు రీమేక్. అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5, 2022న తెలుగు మరియు హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోందని సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ రైట్స్ని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. పూరి జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa