మహర్షి, నాంది సినిమాలతో హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని దర్శకుడు విజయ్ కనకమేడలతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. జూన్ 2021లో ప్రకటించబడిన ఈ చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజాగా ఈరోజు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకి 'ఉగ్రం' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa