కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి టెంపరరీగా 'సూర్య 42' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. చెన్నైలోని రామాపురంలోని అగరం ఫౌండేషన్ కార్యాలయంలో ఈ సినిమా పూజా కార్యక్రమం జరగగా హీరో సూర్య, దర్శకుడు శివ, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 2 భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో సూర్య సరసన జోడిగా బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ నటించనున్నట్లు సమాచారం. కెఇ జ్ఞానవేల్, విక్రమ్, వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa