కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఎన్టీఆర్ 30" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ నెల 31న ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించవచ్చని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించిన అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుండి త్వరలో వెలువడనుంది. 150 కోట్ల బడ్జెట్‌తో 'ఎన్టీఆర్ 30' సినిమాని తీస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa