చాన్నాళ్ల తదుపరి ఇద్దరు హీరోయిన్లు కలిసి లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం "శాకినీ డాకిని". ఆ ఇద్దరు హీరోయిన్లెవరంటే ఒకరు గ్లామరస్ రెజీనా కస్సాండ్ర, మరొకరు ట్యాలెంటెడ్ నివేదా థామస్.
లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేసారు. దీని ప్రకారం, ఈ మూవీ టీజర్ రేపు ఉదయం 11.07 గంటలకు విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్లు షాలిని, దామిని అనే పాత్రల్లో నటిస్తున్నారు.
సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో సురేష్ బాబు దగ్గుబాటి, సునీతా తాటి, హ్యూన్ వూ థామస్ కిమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ MC క్లీరీ, నరేష్ కుమరన్ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa