ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొన్నియిన్ సెల్వన్: 'చోళ చోళ' ప్రోమో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 01:28 PM

ఈ రోజు సాయంత్రం ఆరింటికి విడుదల కానున్న పొన్నియిన్ సెల్వన్ సెకండ్ లిరికల్ సాంగ్ "చోళ చోళ" ప్రోమోను కొంచెంసేపటి క్రితమే మేకర్స్ రిలీజ్ చేసారు. ఓన్లీ మ్యూజిక్ తోనే ఉన్న ఈ ప్రోమోలో బ్లర్ర్ మోడ్ లో విక్రమ్ కనిపిస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ సంయుక్త బ్యానర్ లపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి టీజర్ రిలీజై ప్రేక్షకుల నుండి విశేష స్పందన అందుకుంది.
చియాన్ విక్రమ్ ,ఐశ్వర్యారాయ్ బచ్చన్ , కార్తీ, త్రిష, జయం రవి, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కాబోతుంది.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa