ఈ ఏడాదిలో విడుదలై ఘనవిజయం సాధించిన చిన్న సినిమా "డీజే టిల్లు". ఈ సినిమా అప్పటివరకు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని హీరో సిద్ధూ జొన్నలగడ్డ కు చాలా మంచి పేరును తీసుకొచ్చింది. అలానే, ఈ మూవీ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరిచింది.
లేటెస్ట్ గా ఈ మూవీ సీక్వెల్ పై ఇంటరెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటంటే, ఈ మూవీలో హీరోయిన్ గా పెళ్ళిసందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటించబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతకుముందు ఈ సినిమాలో మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరిగింది. డీజే టిల్లు సీక్వెల్ హీరోయిన్ పై ఏర్పడిన అసంగ్ధత మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసేంత వరకు క్లియర్ అయ్యేలా లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa