ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"కృష్ణ వ్రిoద విహారి" న్యూ రిలీజ్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 03:59 PM

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, సింగర్ టర్న్డ్ యాక్ట్రెస్ షెర్లీ సెటియా జంటగా నటించిన చిత్రం "కృష్ణ వ్రిoద విహారి". అనీష్ కృష్ణ దర్శకత్వంలో, ఐరా క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహాతి స్వరసాగర్ స్వరాలనందించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు యువతను ఆకర్షిస్తున్నాయి. నాగసౌర్య స్టైలిష్ లుక్స్, షెర్లీ గ్లామర్ తో ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో తగినంత బజ్ క్రియేట్ అయ్యింది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావలసి ఉంది. కానీ ఎందుకో తెలియదు ఈ మూవీ నాలుగు నెలలు వాయిదా పడింది. లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీని సెప్టెంబర్ 23న విడుదల చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa