కమెడియన్ కమ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ కమ్ హీరో కమ్ విలన్ ... ఇలా విభిన్న పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేసిన సునీల్ త్వరలోనే "బుజ్జీ ఇలారా " అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాకు జి. నాగేశ్వర రెడ్డి కథను అందించగా, గరుడవేగ అంజి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. SNS క్రియేషన్స్ బ్యానర్ పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్, ధనరాజ్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణ మురళి, జబర్దస్త్ వేణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రేపు విడుదల కాబోతుంది. యంగ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ అల్లరి నరేష్ ఈ ట్రైలర్ ను లాంచ్ చెయ్యనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa