నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందు మొండేటి డైరెక్షన్లో మిస్టికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం "కార్తికేయ 2". ప్రపంచవ్యాప్తం పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 13వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు జరగబోతుంది. ఈ ఈవెంట్ కు మెగా మేనల్లుడు , సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనుపమ్ ఖేర్, హర్ష చెముడు, శ్రీనివాసరెడ్డి, ఆదిత్యా మీనన్ కీరోల్స్ లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa