ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"అయ్యప్పనం కోషియం" రీమేక్లో సూర్య, కార్తి... డైరెక్టర్గా లోకేష్ ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 12:19 PM

2020లో విడుదలైన సూపర్ బ్లాక్ బస్టర్ మలయాళం మూవీ "అయ్యప్పనం కోషియం" తెలుగులో "భీమ్లానాయక్" గా రీమేకై ఇక్కడ కూడా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమార్, బిజుమీనన్ టైటిల్ పాత్రలు పోషించగా, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా నటించారు. లేటెస్ట్ గా అయ్యప్పనం కోషియం మూవీపై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఈ మూవీని తమిళంలో రీమేక్ చెయ్యాలనుందని తెలిపారు. ఐతే, ఈ మూవీ రైట్స్ మరొక ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నాయనుకోండి, ఒకవేళ ఈ సినిమాను తమిళంలో కనక తెరకెక్కిస్తే, పోలీసాఫీసర్ గా హీరో సూర్యను, మాజీ ఆర్మీ ఆఫీసర్ గా హీరో కార్తీని తీసుకోవాలనుందని చెప్పారు. అంతేకాక తనకు సూపర్ స్టార్ రజినీకాంత్, తాలా అజిత్ లతో పని చెయ్యాలని ఉందని చెప్పారు. ప్రస్తుతానికైతే , లోకేష్ విజయ్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa