ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జిన్నా' మూవీ నుండి సన్నీలియోన్ క్యారెక్టర్ పోస్టర్‌ రివీల్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 05:26 PM

ఇషాన్ సూర్య దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విష్ణు మంచు ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ మరియు బాలీవుడ్ యాక్ట్రెస్ సన్నీలియోన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'జిన్నా' అనే టైటిల్‌ను లాక్ చేశారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్న సన్నీలియోన్ క్యారెక్టర్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమాలో రేణుకగా సన్నీలియోన్ నటిస్తుండగా పోస్టర్‌లో మోడ్రన్‌గా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తన సొంత బ్యానర్ ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి అనూప్ రూబెన్స్‌ సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa