ఈ మధ్యకాలంలో వచ్చిన ఐటెం నంబర్స్ లో బాగా ప్రాచుర్యం పొందింది "రా రా రక్కమ్మ" సాంగ్. ఈ పాట కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన "విక్రాంత్ రోణ" చిత్రంలోనిది. సెన్సేషనల్ హిట్ ఐన ఈ పాట పూర్తి వీడియో సాంగ్ ను ఆగస్టు 12వ తేదీ సాయంత్రం 04:05గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో మంచి టాక్ తో, మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. అనూప్ భండారీ దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిరూప్ భండారీ, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa