టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహించిన సినిమా 'కార్తికేయ'. 2014లో వచ్చిన ఈ సినిమా నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై మొదటినుండి మంచి అంచనాలు నెలకొన్నాయి. భారతదేశపు తొలి మిస్టికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, వైవా హర్ష, శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఫుల్ స్వింగ్ లో జరుగుతన్న ప్రమోషన్స్ లో నిఖిల్ మాట్లాడుతూ... ఇంటర్వెల్, క్లైమాక్స్ ల ముందు అరగంట సేపు సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని చెప్పారు. అంతే కాక ఈ సినిమా చూసే ప్రేక్షకులకు అన్నమయ్య సినిమా భక్తిభావన, అరుంధతి సినిమా థ్రిల్లింగ్ అండ్ ఎక్జయిటింగ్ ఫీలింగ్స్ తప్పక కలుగుతాయని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa