కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్లో ఒక క్లాసిక్ హిట్ గా నిలిచిపోతుంది "ఖైదీ" మూవీ. అప్పటికి ఒకే ఒక సినిమాను డైరెక్ట్ చేసిన లోకేష్ కనగరాజ్ ను నమ్మి కార్తీ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మొదటి పార్ట్ క్లైమాక్స్ లోనే హింట్ ఇవ్వడంతో, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ తరవాత లోకేష్, కార్తీ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ లతో బిజీగా మారడం వల్ల ఈ సీక్వెల్ కాస్తా ఆలస్యమవుతూ వస్తుంది.
లేటెస్ట్ గా కార్తీ కొత్త సినిమా "విరుమాన్" ప్రమోషన్స్ లో కార్తీ మాట్లాడుతూ... లోకేష్ కనగరాజ్ విజయ్ సినిమాను పూర్తి చేసిన వెంటనే, వచ్చే ఏడాది తొలి భాగంలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆడియన్స్ కు సూపర్ అప్డేట్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa