ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ కు పవర్ స్టార్ వెరీ స్పెషల్ బర్త్ డే విషెస్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 07:03 PM

టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్, ఎవర్ ఛార్మింగ్ హీరో మహేష్ బాబు ఈ రోజు 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ సెలెబ్రిటీలు, మహేష్ కుటుంబ సభ్యులు, అభిమానులు సోషల్ మీడియాలో మహేష్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్లు పెడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇలా చాలామంది టాలీవుడ్ బిగ్ సెలెబ్రిటీలు మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపగా, లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు.
శుభాకాంక్షలంటే, ఏదో రెండు మూడు లైన్లలో ముగించకుండా, ఏకంగా ఒక స్పెషల్ నోట్ ను విడుదల చేసారు పవన్. ఈ నోట్ లో మహేష్ తో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. "అర్జున్" సమయంలో పైరసీకి విరుద్ధంగా పోరాడిన వ్యక్తి మహేష్ అని, ఆ సమయంలో మహేష్ కు తాను సపోర్ట్ గా ఉన్నానని, జల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాలను, గుర్తుకు తెచ్చుకున్నారు. మహేష్ చేస్తున్న ఛారిటబుల్ కార్యక్రమాలను పొగిడారు. ఫ్యూచర్ లో మరిన్ని విజయాలు ఆయన సొంతం కావాలని కోరుకుంటూ, మహేష్ కు పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa