టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ఇటీవలే "పక్కా కమర్షియల్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తదుపరి తనకు "లౌక్యం" వంటి బిగ్ హిట్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తుండగా, ఖుష్బూ సుందర్ కీలకపాత్రలో నటిస్తుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, శ్రీవాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మాస్ రాజా రవితేజతో ఖరారు చేసుకున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్ల బట్టి వీరిద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయట. ఇటీవలే ఈ చర్చలు ముగిసి, ఫైనల్ స్క్రిప్ట్ కు రవితేజ సరే అన్నాడంట. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతుందంట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa