టాలీవుడ్ హీరో, 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం "జిన్నా". కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో పాయల్ "పచ్చళ్ళ స్వాతి" అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో, విష్ణు క్రైం పార్టనర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa