ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుల్ స్వింగ్ లో జరుగుతున్న "కార్తికేయ 2" ప్రమోషన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 11:26 AM

నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన మిస్టికల్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ "కార్తికేయ 2". ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 13వ తేదీన అంటే శనివారం విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ మేరకు మంగళవారం అంటే ఈరోజు ఉదయం వైజాగ్, మధ్యాహ్నం విజయవాడ, సాయంత్రం తిరుపతి లో కార్తికేయ 2 ప్రమోషన్స్ జరగనున్నాయి. ఈ ప్రచార కార్యక్రమాల్లో నిఖిల్, అనుపమ, శ్రీనివాసరెడ్డి, హర్ష చెముడు తదితర చిత్రసభ్యులు పాల్గొననున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa