టాలీవుడ్ నిర్మాతలు తమకున్న సమస్యల కారణంగా వాటి పరిష్కారం కోరుతూ, ఆగస్టు 1 నుండి షూటింగ్ లను నిలిపివేస్తూ సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో విడుదల తేదీ ఖరారు చేసుకుని, షూటింగ్ ముగింపు దశలో ఉన్న కొన్ని చిత్రాల విడుదల తేదీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ - సమంత ల "ఖుషి" సినిమా కూడా చేరనుందని ప్రచారం జరుగుతుంది.
శివ నిర్వాణ డైరెక్షన్లో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ మధ్యలో ఉంది. సినిమాను అధికారికంగా ఎనౌన్స్ చేసినపుడే, దర్శక నిర్మాతలు డిసెంబర్ 23న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు కూడా. తాజాగా ఇప్పుడు నిర్మాతల సమ్మె కారణంగా ఈ సినిమా డిసెంబర్ లో కాకుండా, 2023 ప్రథమారర్థంలో విడుదల కావొచ్చని అంటున్నారు. ఐతే, దీనిపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa