ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత "శాకుంతలం" పై లేటెస్ట్ మేజర్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 02, 2022, 02:57 PM

"రుద్రమదేవి" తదుపరి గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కిస్తున్న చిత్రం "శాకుంతలం". టైటిల్ పాత్రలో టాలీవుడ్ టాప్ సైరెన్ సమంత నటిస్తుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణశేఖర్ టీం వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గుణశేఖర్ తనయురాలు నీలిమా గుణ నిర్మాతగా వ్యవహరిస్తోంది. దుశ్యంతుని ప్రేయసి, భరతుని తల్లి అయిన శకుంతల జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ఈ ఏడాది ఫిబ్రవరి లో విడదల చేసారు. సమంత మైథలాజికల్ లుక్ కు సామ్ ఫ్యాన్స్ మాత్రమే కాక ఆడియన్స్ కూడా అబ్బుర పడ్డారు. ఇక అప్పటినుండి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ప్రేక్షకులేమో ఈ మూవీ నుండి కొత్త పోస్టర్ కానీ, టీజర్ కానీ, గ్లిమ్స్ గానీ ఇలా ఎదో ఒకటి రావాలని కోరుకుంటుండగా, చిత్రబృందం మాత్రం ఈ మూవీ నుండి ఎటువంటి అప్డేట్ ను ఇవ్వట్లేదు. దీంతో సమంత అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారట.
ఈ విషయాన్ని గమనించిన నీలిమ గుణ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సీజీ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని, సరైన సమయం వచ్చినప్పుడు అద్భుతమైన అప్డేట్లను ఇస్తామని, ఇలాంటి కీలక సమయంలో చిత్రబృందానికి అభిమానుల అండదండలు కావాలని కోరుకుంటూ.. ట్వీట్ చేసింది.
పోతే... ఈ చిత్రంలో దేవ్ మోహన్, మధూ, అదితి బాలన్, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గారాల పట్టి అల్లు అర్హ ఈ చిత్రంలో యువ భరతుని వేషం లో నటించటం విశేషం. ఇదే అర్హకు తొలి స్క్రీన్ ప్రెజెన్స్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa