నిఖిల్ సిద్దార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా, చందు మొండేటి డైరెక్షన్లో "కార్తికేయ 2" తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో జూలై 22న విడుదల కావలసిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల ఆగస్టు 12కి వాయిదా పడింది. ప్రాణం పెట్టి చేసిన సినిమా రిలీజ్ డేట్ లో నెలకొన్న అసందిగ్ధత నిఖిల్ ని లిటరల్ గా ఏడిపించిందంట. ఈ విషయాన్ని స్వయంగా నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మాట్లాడుతూ... ఒక సినిమాకు విడుదల తేదీని ఖరారు చెయ్యడం, దాన్ని అలానే మైంటైన్ చెయ్యడం ఎంత కష్టమో కార్తికేయ 2 సినిమాతో తెలిసిందని చెప్పారు.
జూలై 22న దిల్ రాజు నిర్మించిన థాంక్యూ మూవీ విడుదల కాబోతుండడంతో, తన మూవీకి సోలో రిలీజ్ డేట్ కావాలని, దిల్ రాజు కార్తికేయ 2 వాయిదా పడేటట్టు చేసారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిఖిల్ చెప్పిన దాన్ని బట్టి, దిల్ రాజు నిఖిల్ ను ఇండైరెక్ట్ గా ఏడిపించేసాడన్న మాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa