సినిమా అందరి కష్టార్జితమని, ఏ ఒక్కరిదో కాదని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సి.నారాయణరెడ్డి 91వ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు జీవిత సాఫల్య స్వర్ణ కంకణం ప్రదానం చేశారు. తనలోని నటుడ్ని గుర్తించి ఎన్టీఆర్‌కు చెప్పింది సి.నారాయణరెడ్డేనని బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.