ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టులో RRR బుల్లితెర సందడి షురూ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 01:00 PM

RRR... టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆవిష్కరించిన అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడవ సినిమాగా RRR రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అటుపై నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కొచ్చి, ఒక్క ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా మెజారిటీ వ్యూయర్షిప్ తో దూసుకు పోతుంది.
లేటెస్ట్ గా RRR వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమవుతోంది. ఆగస్టు 14వ తేదీ ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు RRR హిందీ వెర్షన్ ప్రముఖ జీ సినిమా ఛానెల్ లో టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఛానెల్ అధికారికంగా ప్రకటించింది.
రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, ఆలియాభట్, ఒలీవియా మోరిస్, శ్రేయాశరణ్ కీలకపాత్రలు పోషించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa