ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పృథ్విరాజ్ "కడువా" డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ 

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 02:51 PM

మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా, షాజీ కైలాష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "కడువా". ఈ చిత్రంలో సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రలు పోషించారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై సుప్రియ మీనన్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఇటీవలే మలయాళం, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది.
తాజాగా కడువా మూవీ డిజిటల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆగస్టు 4నుండి కడువా మూవీ ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ప్రైమ్ వీడియో సంస్థ అధికారిక ప్రకటన కూడా చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa