కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్ ఒకటి. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా రెండు భాగాలుగా రూపొందుతోంది అని సమాచారం. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'పొంగే నాది' జూలై 31న సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa