ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విష్ణు విశాల్ "మట్టి కుస్తీ" పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 01:21 PM

కోలీవుడ్ లో హీరో విష్ణు  విశాల్ ది ప్రత్యేక శైలి. విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ, తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలనే FIR అనే చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం "గట్టకుస్తి". తెలుగులో "మట్టి కుస్తీ" గా విడుదలవనుంది. ఈ సినిమాకు మాస్ రాజా రవితేజ నిర్మాతగా వ్యవహరించటం విశేషం.
తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తుండగా, విష్ణు విశాల్ స్టూడియోస్, ఆర్ టీ టీం వర్క్స్ బ్యానర్ పై రవితేజ, విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలో జరుగుతుందని, ఇప్పటివరకు సినిమా ఎనభై శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని విష్ణు విశాల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇంకా ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని కూడా చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa