కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి జంటగా నటిస్తున్న చిత్రం విరుమాన్. ఈ చిత్రంతోనే అదితి సినీ కెరీర్ ను స్టార్ట్ చేయబోతుంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముత్తయ్య డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ లో కార్తీ గ్రామీణ యువకుడిగా, పక్కా మాస్ పాత్రలో కనిపిస్తారు. ప్రకాష్ రాజ్, రాజ్ కిరణ్, శరణ్య, ఇంద్రజ , మనోజ్ భారతీరాజా, సింగంపులి ముఖ్య పాత్రలలో నటించారు.
లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు U/A సెర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ కూడా పూర్తయిపోయింది కానీ రిలీజ్ డేట్ పై పక్కా క్లారిటీ రాలేదు.
అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ప్రకారం, ఈ మూవీ ఆగస్టు 31న విడుదల కావాల్సి ఉంది. కానీ, ఆ రోజు విడుదల కావాల్సిన విక్రమ్ "కోబ్రా" వాయిదా పడడంతో, విరుమాన్ రెండు వారాలు ముందుకు జరిగి, ఆగస్టు 11న ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతుందని కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa