ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాంటెడ్ పండుగాడ్:"చుక్క" లాంటి అమ్మాయి అనసూయ

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 10:19 AM

శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబా కోవెలమూడి, వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "వాంటెడ్ పండుగాడ్". పట్టుకుంటే కోటి అనేది శీర్షిక. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇందులో సునీల్, అనసూయ భరద్వాజ్, సుధీర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆగస్టు 19న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి యాంకర్ అనసూయ భరద్వాజ్ ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. పల్లెటూరి అమ్మాయి "చుక్క" క్యారెక్టర్ లో అనసూయ ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వస్తుంది. హిలేరియస్ ఎంటెర్టైన్మెంట్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa