ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీస్మార్ ఖాన్ : పవర్ఫుల్ కాప్ గా ఆది మోషన్ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 06:44 PM

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్, 'RX100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న చిత్రం "తీస్మార్ ఖాన్". కళ్యాన్జీ గోగన డైరెక్షన్లో పక్కా యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి ఆది సాయి కుమార్ పవర్ఫుల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మోషన్ పోస్టర్ ను బట్టి ఆది ఈ సినిమాలో స్టూడెంట్ గా, రౌడీగా, రౌడీ ఆఫీసర్ తీస్మార్ ఖాన్ గా మూడు విభిన్న పాత్రలను పోషిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటివరకు రిలీజైన ట్రైలర్లు, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa