ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం "బింబిసార" తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు. 2 గంటల 26 నిమిషాల నిడివితో విడుదల కానున్న ఈ సినిమా యూ/ఏ సెర్టిఫికెట్ పొందింది.
కళ్యాణ్ రామ్ నటిస్తున్న తొలి హిస్టారికల్ అండ్ పాన్ ఇండియా మూవీ ఇది. వశిష్ట్ డైరెక్షన్లో భారతీయ చక్రవర్తి బింబిసారుడి జీవితం ఆధారంగా సోషల్ ఫాంటసి గా తెరకెక్కిన ఈ మూవీలో క్యాథెరిన్ థెరెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కోశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందిస్తుండగా, చిరంతన్ భట్ స్వరాలను సమకూర్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa