టాలీవుడ్ యంగ్ అండ్ సేనాషనల్ హీరో విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన గ్లామర్ బ్యూటీ సమంత రూత్ ప్రభు జంటగా కనిపించనుంది. ఈ సినిమాకి 'ఖుషి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ లో మూవీ మేకర్స్ ఒక యాక్షన్ బ్లాక్ ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 23, 2022న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa