ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'రామారావు ఆన్ డ్యూటీ'

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 01:22 PM

శరత్ మండవ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనుండగా, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రంలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్ర లోకేష్ మరియు జాన్ విజయ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa